బైబిల్ని మనుషుల జ్ఞానంతో రాశారా?
బైబిలు ఇచ్చే జవాబు
బైబిల్లో లేదా పరిశుద్ధ లేఖనాల్లో, మనకు జ్ఞానాన్ని ఇచ్చే ఎన్నో మాటలు ఉన్నాయి. అయితే, “ప్రతిలేఖనము” దేవుని చేత ప్రేరేపింపబడింది అని స్వయంగా బైబిలే చెబుతుంది. (2 తిమోతి 3:16, 17) అది నిజం అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. ఈ కింది విషయాలు చూడండి:
బైబిల్లో ఉన్న ఖచ్చితమైన చరిత్ర గురించి ఎవ్వరూ సవాలు చేయలేకపోయారు.
బైబిల్ని ఎలాంటి దురుద్దేశం లేని నిజాయితీగల మనుషులు రాశారు. అలా రాశారు కాబట్టే, బైబిల్లో సత్యం స్పష్టంగా కనిపిస్తుంది.
దేవుడు పరలోక రాజ్యం ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తూ, మనుషులను పరిపాలించే హక్కు తనకు మాత్రమే ఉందని నిరూపించుకోవడమే బైబిలు ముఖ్యాంశం.
ప్రాచీన కాలంలోని ప్రజలకు విజ్ఞానశాస్త్రానికి సంబంధించి తప్పుడు నమ్మకాలు ఉండేవి. బైబిల్ని ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసినప్పటికీ అవేవీ బైబిల్లో కనిపించవు.
బైబిలు ముందే చెప్పిన లేదా అంచనా వేసిన ఎన్నో విషయాలు జరిగాయని చరిత్ర పుస్తకాలను చూస్తే తెలుస్తుంది.