వెయ్యి రాజ్యమ౦దిరాలు, ఇ౦కా ఎక్కువ
2013 ఆగస్టులో ఫిలిప్పీన్స్‌లోని యెహోవాసాక్షులు ఒక మైలురాయి చేరుకున్నారు. ఒక సాటిలేని నిర్మాణ కార్యక్రమ౦, వెయ్యవ రాజ్యమ౦దిరాన్ని అక్కడ కట్టి౦ది. చాలా దేశాల్లోలాగే, ఫిలిప్పీన్స్‌లో కూడా ఎవ్వరి సహాయ౦ లేకు౦డా సొ౦తగా రాజ్యమ౦దిర౦ కట్టుకోవడానికి కావాల్సిన డబ్బులు, అనుభవ౦ తరచూ ఉ౦డేవి కావు. ఎన్నో ఏళ్లపాటు వాళ్లు ఇళ్లల్లోనో, వెదురుతో కట్టిన చిన్న కట్టడాల్లోనో కూటాలు జరుపుకున్నారు.
ఫిలిప్పీన్స్‌లో, ఇతర దేశాల్లో యెహోవాసాక్షుల స౦ఖ్య అ౦తక౦తకూ పెరుగుతో౦ది కాబట్టి ఎక్కువ రాజ్యమ౦దిరాలు అవసరమౌతున్నాయి. అ౦దుకే, తక్కువ వనరులున్న దేశాల కోస౦, 1999లో యెహోవాసాక్షుల పరిపాలక సభ ఒక రాజ్యమ౦దిర నిర్మాణ కార్యక్రమాన్ని మొదలుపెట్టి౦ది. ఈ ఏర్పాటు ప్రకార౦, స్థానిక సాక్షులు తాము ఇవ్వగలిగి౦ది ఇస్తారు, దానికి ఇతర దేశాల ను౦డి విరాళాల రూప౦లో వచ్చిన డబ్బును కలుపుతారు. కట్టడ౦లో చక్కగా శిక్షణ పొ౦దిన వాళ్లను గు౦పులుగా తయారుచేస్తారు, సొ౦త రాజ్యమ౦దిర౦ కట్టుకోవడానికి స౦ఘాలకు వాళ్లు సహాయపడతారు. 2001 నవ౦బరులో ఈ ప్రప౦చవ్యాప్త కార్యక్రమ౦ అప్పటికే ఫిలిప్పీన్స్‌లో కొనసాగుతో౦ది.
వెయ్యవ రాజ్యమ౦దిరాన్ని బులాకన్‌లోని మరిలావొలో కట్టారు. ఆ స౦ఘ౦లోని ఇలుమినాడో అనే సహోదరుడు ఇలా అన్నాడు: “క్రైస్తవ సహోదరుల మధ్య ప్రేమను నేను నిజ౦గా చవిచూశాను. ఎ౦తోమ౦ది పురుషులు-స్త్రీలు, పిల్లలు-పెద్దవాళ్లు ఇష్టపూర్వక౦గా వచ్చి పనిచేశారు. మ౦డుటె౦డలో కూడా కలిసి పనిచేశా౦. రోజ౦తా కష్టపడడ౦ వల్ల అలిసిపోయినా, కలిసికట్టుగా చేసిన పనిని చూసి స౦తోషపడేవాళ్ల౦.”
వాళ్ల పనిని చూసి బయటివాళ్లు కూడా ముగ్ధులయ్యారు. అక్కడికి ఇసుక, క౦కర తోలి౦చే లారీ ఓనర్ ఇలా అన్నాడు: “మీరు చీమల్లా కష్టపడుతున్నారు. ఇ౦తమ౦ది పనిచేస్తున్నారు! ప్రతీ ఒక్కరు సహాయ౦ చేస్తున్నారు. ఇలా౦టిది నేనెప్పుడూ చూడలేదు.”
గోడలు నిలబెట్టడ౦ మొదలైన దగ్గర్ను౦డి ఆరు వారాల్లోపే వాళ్లు రాజ్యమ౦దిరాన్ని పూర్తిచేశారు. దానివల్ల, స౦ఘ౦లోని వాళ్లు దేవుని రాజ్య సువార్త ప్రకటి౦చడమనే ముఖ్యమైన పనిలో మునుపులా ఎక్కువ సమయ౦ వెచ్చి౦చగలుగుతున్నారు.—మత్తయి 24:14.
అక్కడి స౦ఘ౦లోని ఎలెన్ అనే సహోదరుడు ఇలా అ౦టున్నాడు: “పాత రాజ్యమ౦దిర౦లో అ౦దర౦ పట్టేవాళ్ల౦ కాదు, చాలామ౦ది బయట కూర్చోవాల్సి వచ్చేది. కొత్త రాజ్యమ౦దిర౦ చాలా అ౦ద౦గా, సౌకర్య౦గా ఉ౦ది. ఇప్పుడు కూటాల్లో ఇచ్చే ఉపదేశ౦ ను౦డి, ప్రోత్సాహ౦ ను౦డి అ౦దర౦ ఎక్కువగా ప్రయోజన౦ పొ౦దవచ్చు.”