మీరేమంటారు?
మీరు దేవుని స్నేహితులు అవడానికి బైబిలు సహాయం చేస్తుందా?
కొందరి నమ్మకాలు:
మనం అపవిత్రులం, పాపులం కాబట్టి దేవుని స్నేహితులు అవ్వలేమని కొందరు అనుకుంటారు. ఇంకొందరు దేవుడు మనల్ని పట్టించుకోడని అంటారు. మరి మీరేమంటారు?
పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?
దేవుడు ‘యథార్థవంతులకు తోడుగా ఉండును.’ (సామెతలు 3:32) మనం దేవుని మాట వింటే ఆయన స్నేహితులం అవుతాం.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?
మన స్నేహితునిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.—యాకోబు 4:8.
మన స్నేహితునిగా, దేవుడు మనకు సహాయం చేయడానికి, మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు.—కీర్తన 86:5.
దేవుని స్నేహితులు ఆయన ప్రేమించే వాటిని ప్రేమిస్తారు, ఆయన అసహ్యించుకునే వాటిని అసహ్యించుకుంటారు.—రోమీయులు 12:9.