సృష్టికర్త ఏం చెప్తున్నాడో మీరు కూడా తెలుసుకోవచ్చు
బైబిల్లో ఉన్న విషయాలన్నీ దేవుడే రాయించాడు. అలాగని ఎలా చెప్పవచ్చు? కొన్ని వేల సంవత్సరాల క్రితం, దేవుడు తన ఆలోచనల్ని కొంతమంది మనసుల్లో ఉంచాడు, వాటినే వాళ్లు రాశారు. వాళ్లు రాసిన విషయాలన్నిటినీ ‘దేవుడే ప్రేరేపించాడు.’—2 తిమోతి 3:16.
మీరు వాటిని తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు
“యెహోవా అనే నేనే . . . నీకు ప్రయోజనం కలిగేలా నేనే నీకు బోధిస్తున్నాను, నువ్వు నడవాల్సిన దారిలో నేనే నిన్ను నడిపిస్తున్నాను. నువ్వు నా ఆజ్ఞల్ని శ్రద్ధగా వింటే ఎంత బావుంటుంది! అప్పుడు నీ శాంతి నదిలా, నీ నీతి సముద్ర తరంగాల్లా ఉంటుంది.”—యెషయా 48:17, 18.
మనం ఎప్పుడూ మనశ్శాంతితో సంతోషంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే, అలా ఉండాలంటే ఏం చేయాలో ఆయన మనకు చెప్తున్నాడు.
దేవుడు రాయించిన విషయాల్ని తెలుసుకోండి
‘అన్నిదేశాల్లో మంచివార్త ప్రకటించబడాలి.’—మార్కు 13:10.
ఆ “మంచివార్త” ఏంటంటే, దేవుడు త్వరలో మన కష్టాలన్నీ తీసేస్తాడు, ఈ భూమిని అందమైన తోటలా మారుస్తాడు, చనిపోయిన మనవాళ్లను తిరిగి బ్రతికిస్తాడు. యెహోవాసాక్షులు ఈ మంచివార్తనే ప్రపంచంలో అందరికీ చెప్తున్నారు.