సంతోషాన్ని తీసుకొచ్చే మార్గం
మంచి ఆరోగ్యం, తట్టుకునే లేదా కోలుకునే లక్షణం
ఎంతోకాలంగా ఉన్న అనారోగ్యం లేదా వైకల్యం, జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. చురుకుగా, ఆరోగ్యంగా ఉన్న వుల్ఫ్ అనే అతను పక్షవాతం వచ్చాక ఇలా అంటున్నాడు: “నేను బాగా కృంగిపోయాను. నా బలం, ధైర్యం, శక్తి అన్ని తగ్గిపోయాయి . . . నేను కుప్పకూలిపోయినట్లు అనిపించింది.”
మన ఆరోగ్యాన్ని పూర్తిగా మనం కంట్రోల్ చేసుకోలేమని వుల్ఫ్ అనుభవం చూపిస్తుంది. అయినా అనారోగ్యం బారిన పడకుండా మనం కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ మన ఆరోగ్యం పాడైపోతే మనం ఏమి చేయాలి? అది మనల్ని అసంతోషంలోకి నెట్టేస్తుందా? అస్సలు కాదు. ఎందుకు కాదో ఇప్పుడు చూద్దాం. కానీ ముందు మనం అసలు మంచి ఆరోగ్యాన్ని తీసుకొచ్చే కొన్ని సలహాలను చూద్దాం.
“అలవాట్ల విషయంలో మితంగా ఉండాలి.” (1 తిమోతి 3:2, 11) ఎక్కువగా తినడం లేదా తాగడం ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. డబ్బును కూడా వృథా చేస్తుంది. “ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినువారితోనైను సహవాసము చేయకుము. త్రాగుబోతులును తిండిపోతులును దరిద్రులగుదురు.”—సామెతలు 23:20, 21.
మీ శరీరాన్ని కలుషితం చేసుకోకండి. “శరీరానికి, మనసుకు ఏ కళంకం లేకుండా మనల్ని మనం శుభ్రపర్చుకుందాం.” (2 కొరింథీయులు 7:1) పొగాకు నమలడం లేదా కాల్చడం ద్వారా, తాగుబోతుతనం లేదా మాదక ద్రవ్యాల ద్వారా ప్రజలు శరీరాన్ని కలుషితం చేసుకుంటున్నారు. ఉదాహరణకు “పొగ త్రాగడం ద్వారా జబ్బులు, వైకల్యాలు వస్తాయి, శరీరంలో దాదాపు ప్రతి అవయవం దెబ్బతింటుంది” అని U.S. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎండ్ ప్రివెంషన్ అంటుంది.
మీ శరీరాన్ని, మీ జీవితాన్ని విలువైన బహుమానాలుగా చూడండి. “ఆయన [దేవుడు] వల్లే మనకు జీవం వచ్చింది, ఆయన వల్లే మనం కదులుతున్నాం, ఇక్కడున్నాం.” (అపొస్తలుల కార్యాలు 17:28) ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం వల్ల పనిచేసే చోట గానీ, డ్రైవింగ్‌లో గానీ ఉల్లాస కార్యక్రమాలను ఎంపిక చేసుకునే విషయంలో గానీ అనవసరమైన సాహసాలు చేయము. జీవితాంతం వైకల్యంతో బాధపడడం కన్నా ఆ క్షణం కలిగే థ్రిల్ అంత ముఖ్యం కాదు.
నెగెటివ్ ఫీలింగ్స్‌ని ఆపుకోండి. మీ మనసుకు శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి అనవసరమైన కంగారును, అణుచుకోలేని కోపాన్ని, అసూయను, ఇతర హానికారక లక్షణాలను పెంచుకోకుండా ఆపుకోవడానికి ప్రయత్నించండి. “కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము” అని కీర్తన 37:8 చెప్తుంది. ఇంకా “రేపటి గురించి ఎప్పుడూ ఆందోళన పడకండి, ఎందుకంటే రేపుండే ఆందోళనలు రేపు ఉంటాయి.”—మత్తయి 6:34.
సామెతలు 14:30 చెప్తుంది. బైబిలు ఇంకా ఇలా చెప్తుంది: “సంతోషముగల మనస్సు ఆరోగ్యకారణము.” (సామెతలు 17:22) ఇవి సైన్స్‌పరంగా కూడా మంచి మాటలు. స్కాట్లాండ్‌లో ఒక డాక్టర్ ఇలా అంటున్నాడు, “మీరు సంతోషంగా ఉంటే సంతోషంగా లేనివాళ్లకన్నా మీకు, భవిష్యత్తులో అనారోగ్య పరిస్థితులు తక్కువగా వస్తాయి.”
మంచి విషయాల గురించి ఆలోచించండి. “సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము” అనితట్టుకుని, కోలుకునే లక్షణం పెంచుకోండి. ముందు చెప్పిన వుల్ఫ్‌లా ఎక్కువకాలంగా ఉన్న శ్రమను తట్టుకోవడం తప్ప మనకు వేరే మార్గం ఉండకపోవచ్చు. అయినా, మనం ఎలా తట్టుకుంటామో మనమే నిర్ణయించుకోవచ్చు. కొంతమంది నిరుత్సాహంలో మునిగిపోతారు, దానివల్ల పరిస్థితులు ఇంకా చెడిపోతాయి. “శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు” అని సామెతలు 24:10 లో ఉంది.
కొంతమంది ముందు నిరాశపడిపోయినా తర్వాత తట్టుకుని నిలబడతారు. పరిస్థితులకు తగ్గట్టుగా మారతారు. తట్టుకోవడానికి మార్గాలను కనుక్కుంటారు. వుల్ఫ్ విషయంలో అదే జరిగింది. ఎంతో ప్రార్థించి, బైబిల్లో ఉన్న మంచి సందేశం గురించి బాగా ఆలోచించాక, అతను “అడ్డంకులకు బదులు అవకాశాలను చూడడం మొదలుపెట్టాడు.” అంతేకాకుండా, పెద్దపెద్ద శ్రమలు అనుభవించిన ఎంతోమందిలా ఆయన కూడా కనికరం, సానుభూతి లాంటి లక్షణాల గురించి విలువైన పాఠాలు నేర్చుకున్నాడు. దానివల్ల బైబిల్లో ఉన్న ఓదార్పు కలిగించే విషయాలను ఇతరులకు చెప్పేలా కదిలించబడ్డాడు.
స్టీవ్ అనే అతను కూడా చాలా దెబ్బతిన్నాడు. 15 సంవత్సరాల వయసులో అతనికి యాక్సిడెంట్ అయ్యి మెడ నుండి కింద భాగం అంతా చచ్చుబడిపోయింది. అతనికి 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి చేతుల్లో శక్తిని తిరిగి పొందాడు. ఆ తర్వాత అతను యూనివర్సిటీకి వెళ్లాడు, అక్కడ అతను మాదక ద్రవ్యాలు, మద్యం, చెడ్డ లైంగిక అలవాట్లలో కూరుకుపోయాడు. ఆయనకు బైబిలు గురించి నేర్చుకోవడం మొదలుపెట్టేవరకు జీవితం మీద ఏ ఆశ లేదు. కానీ బైబిలు అతనికి జీవితంలో కొత్త ఆశను చిగురింపచేసింది. చెడు అలవాట్లను జయించడానికి సహాయం చేసింది. అతను ఇలా అంటున్నాడు: “సంవత్సరాలుగా నా జీవితంలో ఉన్న శూన్యం ఇప్పుడు లేదు. నా జీవితం ఇప్పుడు శాంతితో, సంతోషంతో, సంతృప్తితో నిండిపోయింది.”
స్టీవ్, వుల్ఫ్ చెప్పిన మాటలు మనకు కీర్తన 19:7, 8 లో ఉన్న మాటలను గుర్తు చేస్తాయి: “యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును . . . యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును యెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును.”