కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

లక్ష్యాలు పేపర్‌ మీద లేదా దేనిమీదైనా గీసిన ప్లాన్‌ లాంటివి. కష్టపడి పనిచేస్తే మీరు ఆ ప్లాన్‌ని నిజం చేసుకోవచ్చు

ఎదుగుతున్న పిల్లలకు

12: లక్ష్యాలు

12: లక్ష్యాలు

అంటే ఏంటి?

లక్ష్యం లేదా గురి అంటే నెరవేరాలని మీరు కోరుకునే ఒక కల మాత్రమే కాదు. నిజమైన లక్ష్యాలు చేరుకోవడానికి మంచి ప్రణాళిక ఉండాలి, పరిస్థితులకు తగ్గట్లుగా మారగలిగే సామర్థ్యం ఉండాలి, ఇంకా ఎప్పటిలానే బాగా కష్టపడాలి.

లక్ష్యాలు చిన్నచిన్నవి ఉంటాయి (చేరుకోవడానికి రోజులు లేదా వారాలు పట్టేవి), మామూలు లక్ష్యాలు ఉంటాయి (నెలలు పట్టేవి), పెద్దపెద్ద లక్ష్యాలు ఉంటాయి (సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువ కాలం పట్టేవి). పెద్దపెద్ద లక్ష్యాలను చేరుకోవడానికి, ఒకదాని తర్వాత ఒకటిగా చేరుకోవాల్సిన చిన్న లక్ష్యాలు పెట్టుకోవచ్చు.

ఎందుకు ముఖ్యం?

లక్ష్యాలు చేరుకున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ స్నేహాలు బలపడతాయి, మీ సంతోషం పెరుగుతుంది.

ఆత్మవిశ్వాసం: మీరు చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకున్నప్పుడు, పెద్ద లక్ష్యాలను చేరుకోగలననే నమ్మకం మీకు కలుగుతుంది. ప్రతిరోజూ వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం మీకు ఉంటుంది. ఉదాహరణకు తప్పు చేయమని మీ తోటివాళ్లు బలవంతపెట్టినప్పుడు మీరు వాళ్లు చెప్పినట్లు చేయరు.

స్నేహాలు: మంచి లక్ష్యాలు ఉన్నవాళ్లకు తమకు ఏమి కావాలో తెలుసు, దానికోసం పనిచేయడం కూడా వాళ్లకు ఇష్టం. అలాంటి వాళ్లతో ఉండాలని చాలామంది కోరుకుంటారు. అంతేకాదు మీ లాంటి లక్ష్యమే ఉన్నవాళ్లతో కలిసి పనిచేయడం ద్వారా మీరు మీ స్నేహాన్ని మరింత బలపర్చుకోవచ్చు.

సంతోషం: మీరు లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకున్నప్పుడు, సాధించామనే భావన మీలో కలుగుతుంది.

“నాకు లక్ష్యాలు పెట్టుకోవడం ఇష్టం. దానివల్ల నాకు చేయడానికి ఏదో ఒక పని ఉంటుంది. ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో నేను పని చేయగలుగుతాను. మీరు ఒక లక్ష్యాన్ని చేరుకుంటే, వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, ‘ఆహా, నేను నిజంగా చేయగలిగాను! నేను అనుకున్నదాన్ని సాధించాను’ అనే ఆలోచన చాలా బాగుంటుంది.”—క్రిస్టాఫర్‌.

మంచి సూత్రాలు: “గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు.”—ప్రసంగి 11:4.

మీరు ఏమి చేయవచ్చు

లక్ష్యాలు పెట్టుకోవడానికి, వాటిని చేరుకోవడానికి ఇలా చేసి చూడండి.

ఏది ఎక్కువ ముఖ్యమో తెలుసుకోండి. మీరు పెట్టుకోగలిగిన లక్ష్యాలతో ఒక లిస్ట్‌ తయారు చేసుకోండి. వాటిలో ముఖ్యమైనవి ఏవో చూసుకోండి. మీరు మొదట దేని మీద పనిచేయాలని అనుకుంటున్నారు, రెండవది, మూడవది, ఇంకా అలా వరుసలో పెట్టుకోండి.

ప్లాన్‌. ప్రతి లక్ష్యానికి లేదా గోల్‌కి ఇలా చేయండి:

  • ఒక డెడ్‌లైన్‌ అంటే చేరుకోగలిగిన తేదీ పెట్టుకోండి.

  • దానికి ఏమేమి చేయాలో ప్లాన్‌ చేసుకోండి.

  • ఎలాంటి అడ్డంకులు రావచ్చో, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి.

పనిచేయండి. మీ లక్ష్యం చేరుకోవడానికి అవసరమైన ప్రతీదాన్ని మీరు ఏర్పాటు చేసుకునే వరకు ఆగకండి. ఇలా ఆలోచించండి, ‘నా లక్ష్యం చేరుకోవడానికి నేను చేయాల్సిన మొదటి పని ఏంటి?’ తర్వాత దాన్ని చేయండి. ప్రతి పని చేస్తున్నప్పుడు మీరు ఎలా అభివృద్ధి సాధిస్తున్నారో చూసుకోండి.

మంచి సూత్రాలు: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు తాలిమిలేక పనిచేయువానికి నష్టమే ప్రాప్తించును.”—సామెతలు 21:5.