ప్రేమతో బలపర్చబడండి
ప్రేమతో బలపర్చబడండి
‘నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.’—మత్తయి 22:37.
1. (ఎ) ఒక క్రైస్తవుడు అలవర్చుకునే కొన్ని లక్షణాలు ఏవి? (బి) అత్యంత ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణం ఏది, ఎందుకు?
మంచి పరిచారకునిగా ఉండేందుకు ఒక క్రైస్తవుడు ఎన్నింటినో అలవర్చుకుంటాడు. సామెతల గ్రంథం తెలివి, వివేచన, జ్ఞానములకున్న విలువను ఉన్నతపరుస్తోంది. (సామెతలు 2:1-10) దృఢమైన విశ్వాసమూ, బలమైన నిరీక్షణా కల్గివుండవలసిన అవసరాన్ని గురించి అపొస్తలుడైన పౌలు చర్చించాడు. (రోమీయులు 1:16, 17; కొలొస్సయులు 1:5; హెబ్రీయులు 10:39) సహనమూ, ఆశానిగ్రహమూ కూడా ఎంతో ప్రాముఖ్యం. (అపొస్తలుల కార్యములు 24:25; హెబ్రీయులు 10:36) అయితే, ఒక మూలకం ఉంది, అది గనుక కొరవడితే, ఇతర లక్షణాల వన్నె తరిగిపోతుంది, అవి విలువలేనివైపోతాయి కూడా. ఆ మూలకమే ప్రేమ.—1 కొరింథీయులు 13:1-3, 13.
2. ప్రేమ యొక్క ప్రాముఖ్యతను యేసు ఎలా చూపించాడు, ఇది ఏ ప్రశ్నలను ఉత్పన్నం చేస్తుంది?
2 “మీరు ఒకనియెడల ఒకడు ప్రేమగలవారైనయెడల దీనిబట్టి మీరు నా శిష్యులని అందరును తెలిసికొందుర”ని చెప్పినప్పుడు యేసు ప్రేమకున్న ప్రాముఖ్యతను చూపించాడు. (యోహాను 13:35) నిజక్రైస్తవత్వపు గుర్తింపు చిహ్నం ప్రేమే గనుక, మనల్ని మనం ఇలా ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది: ప్రేమ అంటే ఏమిటి? అది, అన్నిటికన్నా మిన్నగా తన శిష్యులకు గుర్తింపు చిహ్నమై ఉంటుందని యేసు చెప్పేంత ప్రాముఖ్యమైనది ఎందుకైయుంది? మనం ప్రేమను ఎలా అలవర్చుకోవచ్చు? మనం ఎవర్ని ప్రేమించాలి? ఈ ప్రశ్నల్ని మనం పరిశీలిద్దాము.
ప్రేమంటే ఏమిటి?
3. ప్రేమను ఎలా వర్ణించవచ్చు, దానిలో మనస్సు, హృదయం రెండూ ఎలా ఇమిడివున్నాయి?
3 ప్రేమ యొక్క ఒక వివరణ ఏమిటంటే, ‘మరో వ్యక్తి పట్ల వాత్సల్యపూరితమైన వ్యక్తిగత అనుబంధమనే భావన లేక ప్రగాఢమైన అనురాగం, వాత్సల్యపూరితమైన మక్కువ లేక ఇష్టం.’ ఈ లక్షణం, కొన్నిసార్లు గొప్ప వ్యక్తిగతమైన త్యాగం చేయవలసివచ్చినప్పటికీ, ఇతరుల మేలు కోసం కృషి చేసేందుకు ప్రజలను పురికొల్పుతుంది. బైబిలులో వర్ణించబడినట్లుగా ప్రేమలో మనస్సు, హృదయం రెండూ ఇమిడి ఉన్నాయి. మనస్సు లేక మేధస్సు ఒక పాత్ర నిర్వహిస్తుంది ఎందుకంటే ప్రేమించే వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ప్రేమిస్తాడు, తనలోనూ అలాగే తాను ప్రేమించే ఇతర వ్యక్తుల్లోనూ ఆకర్షణీయమైన లక్షణాలే గాక బలహీనతలు కూడా ఉంటాయని గుర్తిస్తాడు. మేధస్సు పాత్ర ఇంకా ఉంది, ఎందుకంటే ఒక క్రైస్తవుడు బహుశా కొన్నిసార్లు తన సహజ ప్రవృత్తికి భిన్నంగా కూడా కొంతమందిని ప్రేమిస్తాడు—దానికి కారణం అలా ప్రేమించాలని దేవుడు కోరుతున్నాడని తన బైబిలు అధ్యయనం ద్వారా అతడు తెలుసుకోవడమే. (మత్తయి 5:44; 1 కొరింథీయులు 16:14) అయినప్పటికీ, ప్రేమ ప్రాథమికంగా హృదయంలో నుండి వస్తుంది. బైబిలులో బయల్పర్చబడిన నిజమైన ప్రేమ ఎన్నడూ కేవలం మేధస్సుకు సంబంధించినది కాదు. దానికి ఎంతో యథార్థత, భావోద్వేగపరమైన నిబద్ధత అవసరం.—1 పేతురు 1:22.
4. ప్రేమ ఏ విధంగా ఒక బలమైన బంధం?
4 స్వార్థపరులైన వ్యక్తులకు నిజమైన ప్రేమపూర్వక సంబంధాన్ని కల్గివుండే సామర్థ్యం ఉండదు, ఎందుకంటే ప్రేమించే వ్యక్తి తన స్వంత ఆసక్తులకన్నా అవతలి వ్యక్తి ఆసక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వటానికి సిద్ధంగా ఉంటాడు. (ఫిలిప్పీయులు 2:2-4) ప్రేమతో ఇచ్చినప్పుడు, “పుచ్చుకొనుటకంటె ఇచ్చుట ధన్యము” అని చెప్పిన యేసు మాటలు ప్రాముఖ్యంగా నిజమై ఉంటాయి. (అపొస్తలుల కార్యములు 20:35) ప్రేమ చాలా శక్తివంతమైన బంధం. (కొలొస్సయులు 3:14) తరచూ దానిలో స్నేహం ఇమిడి ఉంటుంది, కానీ ప్రేమానుబంధం స్నేహబంధం కన్నా బలమైనది. భార్యాభర్తల మధ్యనుండే అనురాగబంధం కొన్నిసార్లు ప్రేమ అని వర్ణించబడుతుంది; అయితే, మనల్ని అలవర్చుకోమని బైబిలు ప్రోత్సహిస్తున్న ప్రేమ శారీరక ఆకర్షణ కన్నా ఎక్కువకాలం నిలుస్తుంది. ఒక జంట ఒకరినొకరు నిజంగా ప్రేమించుకున్నప్పుడు, వృద్ధాప్యపు అనారోగ్యం మూలంగానో, వారిలో ఒకరు అసమర్థులైపోయినందు వల్లనో శారీరక సంబంధం కల్గివుండే అవకాశం లేనప్పుడు కూడా వాళ్లు కలిసే ఉంటారు.
ప్రేమ—ఆవశ్యకమైన లక్షణం
5. ఒక క్రైస్తవునికి ప్రేమ ఎందుకు ఆవశ్యకమైన లక్షణం?
5 ఒక క్రైస్తవునికి ప్రేమ ఎందుకు ఆవశ్యకమైన లక్షణం? ఎందుకంటే, మొదటగా, ఒకరినొకరు ప్రేమించుకోమని యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. ఆయనిలా చెప్పాడు: “నేను మీ కాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు. మీరు ఒకనినొకడు ప్రేమింపవలెనని యీ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను.” (యోహాను 15:14, 17) రెండవదిగా, యెహోవా ప్రేమ యొక్క మూర్తిమంతమై ఉన్నాడు, ఆయన ఆరాధకులుగా మనం ఆయనను అనుకరించాలి. (ఎఫెసీయులు 5:1; 1 యోహాను 4:16) యెహోవా యేసులను గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడమే నిత్యజీవమని బైబిలు చెప్తుంది. మనం దేవునిలా ఉండడానికి ప్రయత్నించకపోతే ఆయన మనకు తెలుసని మనమెలా చెప్పగలం? అపొస్తలుడైన యోహాను ఇలా తర్కించాడు: “దేవుడు ప్రేమాస్వరూపి; ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు.”—1 యోహాను 4:8.
6. ప్రేమ మన జీవితాల్లోని వివిధ కోణాలను ఎలా సమతూకపర్చగలదు?
6 మూడో కారణాన్ని బట్టి కూడా ప్రేమ ప్రాముఖ్యమైనది: అది మన జీవితంలోని వివిధ కోణాలను సమతూకం చేసుకునేందుకు మనకు సహాయం చేసి, మనం చేసేదానికి మంచి ఉద్దేశాన్ని జతచేస్తుంది. ఉదాహరణకు, దేవుని వాక్య జ్ఞానాన్ని తీసుకుంటూనే ఉండడం ప్రాముఖ్యం. అలాంటి జ్ఞానం ఒక క్రైస్తవునికి ఆహారం వంటిది. అది పరిణతి చెందడానికీ, దేవుని చిత్తానికి అనుగుణ్యంగా ప్రవర్తించడానికీ ఆయనకు సహాయం చేస్తుంది. (కీర్తన 119:105; మత్తయి 4:4; 2 తిమోతి 3:15, 16) అయితే, “జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును” అని పౌలు హెచ్చరించాడు. (1 కొరింథీయులు 8:1) ఖచ్చితమైన జ్ఞానంతో సమస్యేమీ లేదు. ఉన్న సమస్యల్లా మనదగ్గరే ఉంది, మనలో పాపభరితమైన దృక్పథాలున్నాయి. (ఆదికాండము 8:21) ప్రేమ యొక్క సమతూకపరిచే ప్రభావం గనుక లేకపోతే, జ్ఞానం ఒక వ్యక్తి తాను ఇతరులకన్నా ఉన్నతుడనని భావిస్తూ ఉప్పొంగేలా చేస్తుంది. ఆయనే గనుక ప్రాథమికంగా ప్రేమచే పురికొల్పబడి ఉన్నట్లైతే అలా ఉప్పొంగడు. “ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు.” (1 కొరింథీయులు 13:4) ప్రేమచే పురికొల్పబడిన క్రైస్తవుడు ఎంతో లోతైన జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ అహంకారిగా తయారుకాడు. ప్రేమ ఆయనను వినమ్రునిగా చేసి, తనకు తాను పేరు సంపాదించుకోవాలనే కోరికను నివారించేలా చేస్తుంది.—కీర్తన 138:6; యాకోబు 4:6.
7, 8. శ్రేష్ఠమైన కార్యములపై మనస్సును కేంద్రీకరించడానికి ప్రేమ మనకెలా సహాయం చేస్తుంది?
7 పౌలు ఫిలిప్పీయులకు ఇలా వ్రాశాడు: “మీరు శ్రేష్ఠమైన కార్యములను వివేచింపగలవారగుటకు, మీ ప్రేమ తెలివితోను, సకలవిధములైన అనుభవజ్ఞానముతోను కూడినదై, అంతకంతకు అభివృద్ధిపొందవలెనని . . . ప్రార్థించుచున్నాను.” (ఫిలిప్పీయులు 1:9, 10) శ్రేష్ఠమైన కార్యముల గురించి వివేచించేందుకైన ఈ ప్రోత్సాహాన్ని అనుసరించడానికి క్రైస్తవ ప్రేమ మనకు సహాయం చేస్తుంది. ఒక ఉదాహరణగా, పౌలు తిమోతికి వ్రాసిన ఈ మాటలను పరిశీలించండి: “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నా[డు].” (1 తిమోతి 3:1) ప్రపంచవ్యాప్తంగా 2000వ సేవా సంవత్సరంలో, 1,502 క్రొత్త సంఘాలు ఏర్పడటంతో వాటి మొత్తం సంఖ్య 91,487కు చేరుకుంది. కాబట్టి, ఇంకా ఎక్కువమంది పెద్దల అవసరత ఉంది, ఆ ఆధిక్యతకు చేరుకోడానికి కృషి చేసేవారు మెచ్చుకొనదగినవారు.
8 అయితే పైవిచారణాధిక్యతలను చేరుకోడానికి కృషి చేస్తున్నవారు, అలాంటి ఆధిక్యతకున్న ఉద్దేశాన్ని మనస్సులో ఉంచుకుంటే చక్కని సమతూకాన్ని కల్గివుండగలరు. కేవలం అధికారం లేక పేరుప్రతిష్ఠలు కల్గివుండడం ప్రాముఖ్యమైన విషయం కాదు. యెహోవాను ప్రీతిపర్చే పెద్దలు ఆయన పట్లా, తమ సహోదరుల పట్లా ఉన్న ప్రేమచే పురికొల్పబడతారు. వారు ప్రముఖస్థానాన్ని వెదకరు లేక అజమాయిషీ చేయడానికి ప్రయత్నించరు. అపొస్తలుడైన పేతురు, మంచి దృక్పథం కల్గివుండమని సంఘపెద్దలకు ఉపదేశం ఇచ్చిన తర్వాత, “దీనమనస్సు” కల్గివుండాల్సిన అవసరతను నొక్కి చెప్పాడు. ‘దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి’ అని ఆయన సంఘంలోని వారందరికీ ఉపదేశించాడు. (1 పేతురు 5:1-6) అధ్యక్షపదవిని ఆశించేవారెవరైనా సరే, కష్టపడి పనిచేస్తున్న, దీనులైన, సంఘాలకు ఆశీర్వాదంగా ఉన్న పెద్దల అంటే ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనంతమందిగా ఉన్న పెద్దల ఉదాహరణను పరిగణలోకి తీసుకోవడం మంచిది.—హెబ్రీయులు 13:7.
మంచి దృక్పథం సహించేందుకు మనకు సహాయం చేస్తుంది
9. యెహోవా వాగ్దానం చేసిన ఆశీర్వాదాలను క్రైస్తవులు ఎందుకు మనస్సులో ఉంచుకుంటారు?
9 ప్రేమచే పురికొల్పబడడం యొక్క ప్రాముఖ్యతను మరో మార్గంలో కూడా చూడవచ్చు. ప్రేమనుబట్టి దైవభక్తిని 1 తిమోతి 4:8) ఆ వాగ్దానాలను బలంగా విశ్వసిస్తూ, యెహోవా “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడని” పూర్తిగా ఒప్పించబడే క్రైస్తవుడు విశ్వాసమందు స్థిరంగా నిలబడేందుకు సహాయాన్ని పొందుతాడు. (హెబ్రీయులు 11:6) మనలో చాలామంది దేవుని వాగ్దానాల నెరవేర్పు కోసం ఎంతగానో ఎదురు చూస్తూ, “ఆమేన్; ప్రభువైన యేసూ, రమ్ము” అన్న అపొస్తలుడైన యోహాను మనోభావాన్నే ప్రతిధ్వనింపజేస్తాము. (ప్రకటన 22:20) “తనయెదుట ఉంచబడిన ఆనందము”ను మనస్సులో ఉంచుకోవడం సహించడానికి యేసుకు ఎలాగైతే సహాయం చేసిందో అలాగే, నమ్మకంగా ఉంటే మనకు లభించగల ఆశీర్వాదాల గురించి ధ్యానించడం సహించేలా మనల్ని బలపరుస్తుంది.—హెబ్రీయులు 12:1, 2.
వెదికేవారికి బైబిలు ఇప్పుడు గొప్ప ఆశీర్వాదాలనూ భవిష్యత్తులో ఊహించలేనన్ని అద్భుతమైన ఆశీర్వాదాలనూ వాగ్దానం చేస్తుంది. (10, 11. ప్రేమచే పురికొల్పబడడం సహించడానికి మనకెలా సహాయం చేస్తుంది?
10 యెహోవా సేవ చేయడానికి మనల్ని ముఖ్యంగా ప్రేరేపించేది నూతన లోకంలో జీవించాలన్న కోరికే అయితే అప్పుడేమిటి? పరిస్థితులు కష్టతరంగా మారినప్పుడో లేక మనం కోరుకున్న విధంగాగానీ, మనం కోరుకున్న సమయానికిగానీ జరగనప్పుడో, మనం త్వరగా అసహనానికి లేక అసంతృప్తికి గురికావచ్చు. మనం కొట్టుకొనిపోగల గంభీరమైన ప్రమాదంలో ఉంటాము. (హెబ్రీయులు 2:1; 3:12) తనను వదిలి వెళ్లిపోయిన తన మాజీ సహచరుడైన దేమా గురించి పౌలు ప్రస్తావించాడు. ఎందుకు వెళ్లిపోయాడు? ఎందుకంటే, ‘ఆయన యిహలోకమును స్నేహించాడు.’ (2 తిమోతి 4:10) పూర్తిగా స్వార్థపూరిత కారణాలను బట్టి సేవ చేసేవారెవరైనా అదే పనిని చేసే ప్రమాదంలో ఉంటారు. వారు ప్రపంచంలో అందజేయబడే సత్వర అవకాశాలను బట్టి ఆకర్షితులై, తాము భవిష్యత్తులో పొందగల ఆశీర్వాదాల కోసం ఇప్పుడు త్యాగాలు చేయడానికి సుముఖంగా ఉండరు.
11 భవిష్యత్తులో ఆశీర్వాదాలను పొందాలనే సహజమైన కోరికను కల్గివుండడం లేక శ్రమల నుండి ఉపశమనం లభించాలని కోరుకోవడం సముచితమే అయినప్పటికీ, ప్రేమ మన జీవితంలో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదై ఉండాలనేదాని పట్ల మనకుగల ప్రశంసను పెంపొందింపజేస్తుంది. ప్రాముఖ్యమైనది యెహోవా చిత్తమే గానీ మన ఇష్టం కాదు. (లూకా 22:41, 42) అవును, ప్రేమ మనల్ని బలపరుస్తుంది. అది, తగిన సమయంలో మనం మన దేవుడు వాగ్దానం చేసినవన్నీ పొందుతామనీ అంతకంటే ఇంకా ఎక్కువే పొందుతామనీ దృఢనమ్మకం కల్గివుండి, ఆయన ఏ ఆశీర్వాదాలు ఇచ్చినా వాటితో తృప్తిపడి సహనంతో దేవునిపై ఆనుకొనడంలో మనం సంతుష్టి పొందేలా చేస్తుంది. (కీర్తన 145:16; 2 కొరింథీయులు 12:8, 9) “ప్రేమ . . . స్వప్రయోజనమును విచారించుకొనదు” కాబట్టి, ఆ ఆశీర్వాదాలను పొందే సమయం ఆసన్నమయ్యేలోగా నిస్వార్థంగా సేవలో కొనసాగేలా ప్రేమ మనకు సహాయపడుతుంది.—1 కొరింథీయులు 13:4, 5.
క్రైస్తవులు ఎవరిని ప్రేమించాలి?
12. యేసు చెప్పినదాని ప్రకారం మనం ఎవరిని ప్రేమించాలి?
12 మోషే ధర్మశాస్త్రం నుండి రెండు వ్యాఖ్యానాలను ఎత్తి చెప్పినప్పుడు, మనం ఎవరిని ప్రేమించాలనే విషయంలో యేసు ఒక సాధారణ సూత్రాన్ని ఇచ్చాడు. ఆయనిలా చెప్పాడు: “నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె[ను]” మరియు “నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలె[ను].”—మత్తయి 22:37-39.
13. మనం యెహోవాను చూడలేకపోయినప్పటికీ, ఆయనను ప్రేమించడాన్ని ఎలా నేర్చుకోగలము?
ఆదికాండము 2:5-23) మొదట్లో పాపం మానవ కుటుంబాన్ని లోబరచుకున్నప్పుడు మనల్ని త్రోసివేయకుండా, మనల్ని విమోచించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా ఆయన మానవజాతితో ఎలా వ్యవహరించాడో తెలుసుకున్నాము. (ఆదికాండము 3:1-5, 15) నమ్మకంగా ఉన్నవారితో ఆయన దయగా వ్యవహరించాడు, చివరికి మన పాపాల క్షమాపణ కోసం ఆయన తన ఏకైక కుమారుడ్ని అనుగ్రహించాడు. (యోహాను 3:16, 36) పెరుగుతున్న ఈ జ్ఞానం యెహోవాపట్ల మన మెప్పును అధికం చేసింది. (యెషయా 25:1) యెహోవా యొక్క ప్రేమపూర్వక శ్రద్ధను బట్టి తాను యెహోవాను ప్రేమిస్తున్నానని రాజైన దావీదు చెప్పాడు. (కీర్తన 116:1-9) నేడు యెహోవా మన గురించి శ్రద్ధ తీసుకుంటున్నాడు, మనకు నడిపింపునిస్తున్నాడు, మనల్ని బలపరుస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మనం ఆయన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, మన ప్రేమ అంత లోతుగా వ్రేళ్లూనుతుంది.—కీర్తన 31:23; జెఫన్యా 3:17; రోమీయులు 8:28.
13 మనం అత్యంత ప్రాముఖ్యంగా యెహోవాను ప్రేమించాలన్నది యేసు మాటల నుండి స్పష్టమౌతుంది. అయితే, మనకు జన్మతః యెహోవాపట్ల ప్రేమ సంపూర్ణంగా ఏర్పడదు. దాన్ని మనం వృద్ధిచేసుకోవాలి. మొదట ఆయన గురించి విన్నప్పుడు, మనం విన్నదాన్ని బట్టి ఆయన వైపుకు ఆకర్షితులమయ్యాము. ఆయన మానవజాతి కోసం భూమిని ఎలా సిద్ధంచేశాడో మనం కొంచెం కొంచెంగా తెలుసుకున్నాము. (మనం మన ప్రేమను ఎలా చూపించగలం?
14. దేవుని పట్ల మనకున్న ప్రేమ నిజమైనదని మనం ఏ విధంగా చూపించగలము?
14 ప్రపంచవ్యాప్తంగా చాలామంది తాము దేవుడ్ని ప్రేమిస్తున్నామని చెప్తారు, కానీ వాళ్లు ప్రవర్తించే విధానం వాళ్లు చెప్తున్నది అబద్ధమని నిరూపిస్తుంది. మనం నిజంగా యెహోవాను ప్రేమిస్తున్నామని ఎలా తెలుసుకోవచ్చు? మనం ప్రార్థనలో ఆయనతో మాట్లాడి, ఎలా భావిస్తున్నామో ఆయనకు చెప్పవచ్చు. మనకున్న ప్రేమ ప్రదర్శితమయ్యే విధంగా మనం ప్రవర్తించవచ్చు. అపొస్తలుడైన యోహాను ఇలా చెప్పాడు: “[దేవుని] వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను; ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. మనమాయనయందున్నామని దీనివలన తెలిసికొనుచున్నాము.” (1 యోహాను 2:5; 5:3) ఇతర విషయాలతోపాటు, మనం కలిసి సహవసించాలనీ, పరిశుభ్రమైన నీతియుక్తమైన జీవితాలను గడపాలనీ దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనం వేషధారణను నివారిస్తాము, సత్యాన్ని మాట్లాడతాము, మన ఆలోచనా విధానాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటాము. (2 కొరింథీయులు 7:1; ఎఫెసీయులు 4:15; 1 తిమోతి 1:5; హెబ్రీయులు 10:23-25) అవసరంలో ఉన్నవారికి వస్తుదాయకమైన సహాయాన్ని అందజేయడం ద్వారా మనం ప్రేమ చూపిస్తాము. (1 యోహాను 3:17, 18) యెహోవా గురించి ఇతరులకు చెప్పకుండా ఉండము. దానిలో, రాజ్య సువార్తను ప్రపంచవ్యాప్తంగా ప్రకటించే పనినందు భాగం వహించడం ఇమిడివుంది. (మత్తయి 24:14; రోమీయులు 10:10) అలాంటి విషయాల్లో దేవుని వాక్యానికి విధేయత చూపించడం, యెహోవా పట్ల మనకున్న ప్రేమ నిజమైనదనేందుకు సాక్ష్యాధారం.
15, 16. గత సంవత్సరం, యెహోవా పట్ల ప్రేమ అనేకమంది జీవితాలను ఎలా ప్రభావితం చేసింది?
15 యెహోవా పట్లగల ప్రేమ, ప్రజలు మంచి నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. గత సంవత్సరం, అలాంటి ప్రేమ 2,88,907 గురు తమ జీవితాలను ఆయనకు సమర్పించుకుని ఆ నిర్ణయాన్ని నీటి బాప్తిస్మం ద్వారా సూచించేలా వారిని నడిపించింది. (మత్తయి 28:19, 20) వారి సమర్పణ అర్థవంతమైనది. అది వారి జీవితాల్లో ఒక మార్పును సూచించింది. ఉదాహరణకు, గెజ్మండ్ అనే వ్యక్తి అల్బేనియాలోని ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుల్లో ఒకడు. కొన్ని సంవత్సరాల పాటు ఆయనా ఆయన భార్యా బైబిలు అధ్యయనం చేసి, ఎన్నో అవాంతరాలు వచ్చినప్పటికీ చివరికి ప్రచారకులుగా అర్హులయ్యారు. గత సంవత్సరం, గెజ్మండ్ బాప్తిస్మం తీసుకున్నాడు, ఆయన 2000 సేవా సంవత్సరంలో అల్బేనియాలో బాప్తిస్మం తీసుకున్న 366 మందిలో ఒకరు. ఒక వార్తాపత్రిక ఆయన గురించి ఒక ఆర్టికల్ ప్రచురించి, ఇలా తెలియజేసింది: “ఆయన జీవితానికొక సంకల్పం ఉంది, దీన్ని బట్టి ఆయనా ఆయన కుటుంబమూ తమ జీవితంలోని ఆనందభరితమైన దినాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడిక తాను ఎంత లాభం పొందగలను అన్నది కాదు గానీ ఇతరులకు సహాయం చేయడానికి తాను ఏమివ్వగలను అన్నదే ఆయనకు ప్రాముఖ్యమైన విషయం.”
16 అలాగే, ఇటీవలనే బాప్తిస్మం తీసుకుని, గువామ్‌లోని ఒక పెట్రోల్ కంపెనీలో పని చేస్తున్న ఒక సహోదరికి ఒక మంచి అవకాశం లభించింది. ఎన్నో సంవత్సరాలపాటు శ్రమించి ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత, ఆ కంపెనీ చరిత్రలోనే మొదటిసారిగా ఒక స్త్రీ వైస్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఆమెకు లభించింది. అయితే, ఇప్పుడామె తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకుంది. కాబట్టి విషయాలను తన భర్తతో చర్చించిన తర్వాత, ఆ క్రొత్త సహోదరి ఆ అవకాశాన్ని త్రోసిపుచ్చి, ఒక పయినీరుగా పూర్తికాల పరిచారకురాలయ్యేలా పురోభివృద్ధి చెందడానికి ఆమె పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని చూసుకుంది. యెహోవాపట్ల ఉన్న ప్రేమ ఆమె ఈ లోకంలో ఆర్థిక విషయాలకోసం వెంపర్లాడే బదులు పయినీరుగా ఆయన సేవ చేయాలని కోరుకునేలా ఆమెను ప్రేరేపించింది. వాస్తవానికి, అలాంటి ప్రేమ ప్రపంచవ్యాప్తంగా 2000 సేవా సంవత్సరంలో పయినీరు పరిచర్యలోని వివిధ రంగాల్లో పాల్గొనేలా 8,05,205 మందిని పురికొల్పింది. ఆ పయినీర్లు ఎంత చక్కని ప్రేమా విశ్వాసాలను చూపించారో కదా!
యేసును ప్రేమించేలా పురికొల్పబడడం
17. ప్రేమ విషయంలో ఏ చక్కని ఉదాహరణను యేసులో మనం చూడవచ్చు?
17 ప్రేమచే పురికొల్పబడిన వారిలో యేసు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన మానవునిగా ఈ భూమిపైకి రాకమునుపు, తన తండ్రినీ మానవజాతినీ ప్రేమించాడు. మూర్తీభవించిన జ్ఞానముగా, ఆయనిలా అన్నాడు: “నేను [యెహోవా] యొద్ద ప్రధానశిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగజేసిన పరలోకమునుబట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచునుంటిని.” (సామెతలు 8:30, 31) యేసుకున్న ప్రేమ ఆయన తన పరలోక నివాసాన్ని విడిచి నిస్సహాయుడైన పసివానిగా జన్మించేలా ఆయనను పురికొల్పింది. ఆయన దీనులతోనూ, నమ్రతగలవారితోనూ సహనంగా, దయగా వ్యవహరించి, యెహోవా శత్రువుల చేతుల్లో బాధలు అనుభవించాడు. చివరికి, సర్వ మానవాళి కోసం ఆయన హింసాకొయ్యపై మరణించాడు. (యోహాను 3:35; 14:30, 31; 15:12, 13; ఫిలిప్పీయులు 2:5-11) సరైన పురికొల్పు విషయంలో ఎంత చక్కని ఉదాహరణ!
18. (ఎ) యేసు పట్ల ప్రేమను మనమెలా పెంపొందింపజేసుకుంటాము? (బి) మనం యేసును ప్రేమిస్తున్నామని ఏ విధంగా ప్రదర్శిస్తాము?
18 సరైన హృదయ పరిస్థితిగల వారు సువార్తల్లోని యేసు జీవిత వృత్తాంతాల గురించి చదివి, ఆయన నమ్మకమైన జీవన 1 పేతురు 1:8) మనమాయనయందు విశ్వాసముంచి, స్వయంత్యాగపూరితమైన ఆయన జీవన విధానాన్ని అనుకరించినప్పుడు మన ప్రేమ ప్రదర్శితమౌతుంది. (1 కొరింథీయులు 11:1; 1 థెస్సలొనీకయులు 1:6; 1 పేతురు 2:21-25) యేసు వార్షిక మరణ జ్ఞాపకార్థ దినానికి 1,48,72,086 మంది 2000, ఏప్రిల్ 19న హాజరైనప్పుడు, యేసును మనం ప్రేమించడానికి గల కారణాలు వారికి గుర్తుచేయబడ్డాయి. అది ఎంత పెద్ద సంఖ్య! యేసు బలి ద్వారా లభించే రక్షణయందు అంతమంది ఆసక్తి కల్గివున్నారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా! యెహోవా యేసులకు మన పట్ల ఉన్న ప్రేమను బట్టి, వారి పట్ల మనకున్న ప్రేమను బట్టి నిజంగా మనం బలపర్చబడుతున్నాం.
విధానం తమకోసం ఎన్ని ఆశీర్వాదాలను తెచ్చిందనే దాన్ని గురించి ధ్యానించినప్పుడు, ఇది వారిలో ఆయన పట్ల ప్రగాఢమైన ప్రేమ పెంపొందేలా చేస్తుంది. నేడు మనం, “మీరాయనను [యేసును] చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు” అని చెప్పినప్పుడు పేతురు ఎవరిని ఉద్దేశించాడో వారిని పోలి ఉన్నాము. (19. ప్రేమను గురించిన ఏ ప్రశ్నలు తర్వాతి ఆర్టికల్‌లో చర్చించబడతాయి?
19 మనం మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణమనస్సుతోనూ, పూర్ణబలముతోనూ యెహోవాను ప్రేమించాలని యేసు చెప్పాడు. అలాగే మనం మన పొరుగువారిని మన వలే ప్రేమించాలని కూడా ఆయన చెప్పాడు. (మార్కు 12:29-31) వారిలో ఎవరు ఇమిడి ఉన్నారు? పొరుగువారి పట్ల ప్రేమ మనం సమతూకాన్ని కాపాడుకోవడానికీ, సరైన దృక్పథాన్ని కల్గివుండడానికీ మనకెలా సహాయం చేస్తుంది? తర్వాతి ఆర్టికల్‌లో ఈ ప్రశ్నలు చర్చించబడతాయి.
మీకు జ్ఞాపకం ఉన్నాయా?
• ప్రేమ ఎందుకు ఒక ఆవశ్యకమైన గుణం?
• మనం యెహోవాను ప్రేమించడాన్ని ఎలా నేర్చుకోవచ్చు?
• మనం యెహోవాను ప్రేమిస్తున్నామని మన ప్రవర్తన ఎలా నిరూపిస్తుంది?
• యేసు పట్ల మనకున్న ప్రేమను మనం ఎలా ప్రదర్శిస్తాము?
[అధ్యయన ప్రశ్నలు]
[10, 11వ పేజీలోని చిత్రాలు]
ఉపశమనం కోసం సహనంతో వేచివుండేలా మనకు ప్రేమ సహాయపడుతుంది
[12వ పేజీలోని చిత్రం]
యేసు గొప్ప బలియర్పణ ఆయనను ప్రేమించేలా మనల్ని పురికొల్పుతుంది