కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

గలిలయలోని బిరియా అడవి (కిద)

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

బైబిలు చెప్తున్నట్లు ప్రాచీన ఇశ్రాయేలులో అడవులు విస్తారంగా ఉండేవా?

వాగ్దాన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అడవులు ఉండేవని, చెట్లు “విస్తారముగా” ఉండేవని బైబిలు చెప్తుంది. (1 రాజు. 10:27; యెహో. 17:15, 17-18) కానీ ఇప్పుడు అక్కడ చాలా ప్రాంతాల్లో చెట్లు తక్కువగా ఉండడం చూసి, అసలు బైబిలు చెప్తున్నది నిజమేనా అని విమర్శకులు సందేహించవచ్చు.

మేడిపండ్ల గుత్తి

లైఫ్‌ ఇన్‌ బిబ్లికల్‌ ఇశ్రాయెల్‌ అనే పుస్తకం ఇలా చెప్తుంది, “ప్రాచీన ఇశ్రాయేలులో అడవులు ఇప్పటికన్నా చాలా విస్తారంగా ఉండేవి.” పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా అలెప్పో పైన్‌ చెట్లు (పైనస్‌ హాలెపెన్సిస్‌), సింధూర వృక్షాలు (క్వెర్కస్‌ కాలిప్రినోస్‌), మస్తకి వృక్షాలు (పిస్టాషియా పాలస్టినా) ఉండేవి. మధ్య పర్వత శ్రేణులకు, మధ్యధరా తీరానికి మధ్యవున్న షెఫేలా అనే పర్వత ప్రాంతంలో మేడిచెట్లు (ఫైకస్‌ సికోమోరస్‌) కూడా ఎక్కువగా కనిపించేవి.

ఇప్పుడు ఇశ్రాయేలులోని కొన్ని ప్రాంతాల్లో అసలు చెట్లే లేవని ప్లాంట్స్‌ ఆఫ్‌ ద బైబిల్‌ అనే పుస్తకం చెప్తుంది. ఎందుకు? అది క్రమక్రమంగా జరిగిన మార్పు అని వివరిస్తూ ఆ పుస్తకం ఇలా చెప్తుంది, ‘మనుషులు వ్యవసాయం కోసం, పశువుల ఆహారం కోసం, ఇంటి నిర్మాణానికి కావాల్సిన కలప కోసం, వంటకు కావాల్సిన కట్టెల కోసం అదేపనిగా అడవులను నరికేస్తున్నారు.’