కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

52వ పాఠం

మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?

మన బట్టలు, కనబడే తీరు ఎలా ఉండాలి?

బట్టలు, కనబడే తీరు విషయంలో మనందరికీ వేర్వేరు ఇష్టాలు ఉంటాయి. అయితే, మనం కొన్ని బైబిలు సూత్రాల్ని పాటిస్తే మనకు నచ్చిన బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ వేసుకుంటూనే యెహోవాను కూడా సంతోషపెట్టవచ్చు. ఇప్పుడు ఆ బైబిలు సూత్రాల్ని పరిశీలిద్దాం.

1. కనబడే తీరు విషయంలో మనకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

మనం “అణకువ, మంచి వివేచన ఉట్టిపడే గౌరవప్రదమైన బట్టలు” ఎంచుకోవాలి, అలాగే “దైవభక్తిగల” వాళ్లకు తగ్గట్టు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. (1 తిమోతి 2:9, 10) ఈ లేఖనంలో ఉన్న నాలుగు సూత్రాలు ఆలోచించండి: (1) మనం “అణకువ” చూపించే బట్టలు వేసుకోవాలి. అంటే మన బట్టలు, కనబడే తీరు ఎదుటివాళ్లలో తప్పుడు కోరికల్ని కలిగించేలా, అందరూ మనల్నే చూసేలా ఉండకూడదు. (2) మనం “మంచి వివేచన” చూపిస్తాం, అంటే కొత్తగా వచ్చే ప్రతీ స్టైల్‌ని మనం అనుసరించం. (3) మనం “గౌరవప్రదమైన” బట్టలు వేసుకోవాలి. యెహోవా ప్రజల బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ రకరకాలుగా ఉన్నా, అవి దేవుని మీద వాళ్లకు గౌరవం ఉందని చూపిస్తాయి. మీరు ఆ విషయాన్ని మీటింగ్స్‌లో గమనించే ఉంటారు. (4) మనం కనబడే తీరు ఎప్పుడూ “దైవభక్తిగల” వాళ్లకు తగ్గట్టు ఉండాలి. అంటే, మనం నిజమైన దేవుణ్ణి ఆరాధించే వాళ్లమని చూపించేలా ఉండాలి.—1 కొరింథీయులు 10:31.

2. మనం కనబడే తీరు మన తోటి ఆరాధకుల మీద ఎలాంటి ప్రభావం చూపించవచ్చు?

మనకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మనకు ఉన్నా, మనం కనబడే తీరు వేరేవాళ్ల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఆలోచించాలి. మనం ఎవ్వర్నీ నొప్పించకుండా, ‘ఇతరుల్ని బలపర్చడానికి, మంచి చేస్తూ వాళ్లను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తాం.’రోమీయులు 15:1, 2 చదవండి.

3. మనం కనబడే తీరు ఇతరుల్ని ఎలా సత్యం వైపు ఆకర్షించవచ్చు?

మనం ఎప్పుడూ సందర్భానికి తగినట్టు, మంచి బట్టలు వేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మరిముఖ్యంగా మీటింగ్స్‌కి వెళ్లేటప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మంచి బట్టలు వేసుకుంటాం. మనం కనబడే తీరు వల్ల, ప్రజల దృష్టి మంచివార్త నుండి పక్కకు మళ్లాలని మనం కోరుకోం. బదులుగా, మనం కనబడే తీరు ఇతరుల్ని సత్యం వైపు ఆకర్షించాలని, ‘మన రక్షకుడైన దేవుని బోధను అలంకరించాలని’ కోరుకుంటాం.—తీతు 2:10.

ఎక్కువ తెలుసుకోండి

మన బట్టలు, కనబడే తీరు క్రైస్తవులకు తగినట్టు ఉండేలా ఎలా చూసుకోవచ్చో పరిశీలించండి.

మనం కనబడే తీరు మనకు అధికారుల మీద గౌరవం ఉందో లేదో చూపిస్తుంది. నిజమే యెహోవా మన పైరూపాన్ని చూడడు, అయినా మనం కనబడే తీరు ద్వారా ఆయన మీద గౌరవం చూపించవచ్చు

4. మనం కనబడే తీరు మనకు యెహోవా మీద గౌరవం ఉందని చూపిస్తుంది

మనం కనబడే తీరు గురించి ఎందుకు ఆలోచించుకోవాలి? అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటో చూద్దాం. కీర్తన 47:2 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలి?

  • మీటింగ్స్‌కి వెళ్లేటప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు మనం కనబడే తీరు ఎలా ఉందో చూసుకోవడం ప్రాముఖ్యం అంటారా? ఎందుకు?

5. బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ విషయంలో ఎలా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు?

వీడియో చూడండి.

మన బట్టలు ఖరీదైనవైనా కాకపోయినా అవి శుభ్రంగా, సందర్భానికి తగినట్టుగా ఉండాలి. 1 కొరింథీయులు 10:24; 1 తిమోతి 2:9, 10 చదవండి. తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

మనం ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకోకూడదు . . .

  • నలిగిన, మురికిగా ఉన్న బట్టలు, లేదా ఇష్టమొచ్చినట్టుగా ఎలా పడితే అలా ఉండే బట్టలు?

  • టైటుగా, ఒళ్లు కనిపించేలా, తప్పుడు కోరికల్ని కలిగించేలా ఉండే బట్టలు?

క్రైస్తవులు మోషే ధర్మశాస్త్రం కింద లేకపోయినా, దాని ద్వారా యెహోవా ఆలోచన ఏంటో తెలుసుకోవచ్చు. ద్వితీయోపదేశకాండం 22:5 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

  • మగవాళ్లు ఆడవాళ్లలా, ఆడవాళ్లు మగవాళ్లలా కనిపించే లాంటి బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ మనం ఎందుకు వేసుకోకూడదు?

1 కొరింథీయులు 10:32, 33; 1 యోహాను 2:15, 16 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

  • కనబడే తీరు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజంలో ఉన్నవాళ్ల గురించి, సంఘంలో ఉన్నవాళ్ల గురించి ఎందుకు ఆలోచించాలి?

  • సాధారణంగా మీ ప్రాంతంలోని ప్రజలు ఎలాంటి బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ వేసుకుంటారు?

  • వాటిలో ఏవైనా క్రైస్తవులకు తగవు అని మీకు అనిపిస్తుందా? ఎందుకు?

మనం మనకు నచ్చినట్టు రకరకాల బట్టలు, హెయిర్‌ స్టైల్స్‌ వేసుకుంటూనే యెహోవాను కూడా సంతోషపెట్టవచ్చు

కొంతమంది ఇలా అంటారు: “నా బట్టలు నా ఇష్టం. ఎవరు ఏమనుకుంటే నాకేంటి?”

  • మీరేమంటారు? ఎందుకు?

ఒక్కమాటలో

కనబడే తీరు విషయంలో మనం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు యెహోవా మీద, ఇతరుల మీద గౌరవం ఉందని చూపిస్తాం.

మీరేం నేర్చుకున్నారు?

  • మన బట్టలు, హెయిర్‌ స్టైల్‌ ఎలా ఉన్నాయో యెహోవా పట్టించుకుంటాడా? ఎందుకు?

  • కనబడే తీరు విషయంలో మనకు ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?

  • మనం కనబడే తీరు వల్ల ప్రజలకు మన ఆరాధన మీద ఎలాంటి అభిప్రాయం కలగవచ్చు?

ఇలా చేసి చూడండి:

ఇవి కూడా చూడండి

మన బట్టలు మన గురించి ఏం చెప్తాయి?

“నేను అందంగా కనిపిస్తున్నానా?” (jw.org ఆర్టికల్‌)

టాటూ వేయించుకునే ముందు మనం ఎందుకు జాగ్రత్తగా ఆలోచించాలో తెలుసుకోండి.

“పచ్చబొట్లు లేదా టాటూలు వేయించుకోవడం గురించి బైబిలు ఏమి చెప్తుంది?” (jw.org ఆర్టికల్‌)

కనబడే తీరు విషయంలో మనకు సహాయం చేసే ఇంకొన్ని సూత్రాలు చూడండి.

“మీ బట్టలు దేవునికి మహిమ తెస్తున్నాయా?” (కావలికోట, సెప్టెంబరు 2016)

దేవునికి నచ్చినట్టు జీవించాలనుకున్న ఒకామె, బట్టల విషయంలో వేరేవాళ్ల నిర్ణయాల్ని గౌరవించడం ఎలా నేర్చుకుందో తెలుసుకోండి.

“మొదట్లో వాళ్ల బట్టలు, హెయిర్‌ స్టైల్‌ చూసి అభ్యంతరపడ్డాను” (తేజరిల్లు! ఆర్టికల్‌)