పత్రిక ముఖ్యాంశం | బైబిలు దాడుల్ని తట్టుకొని నిలిచింది
బైబిలు ఎలా నిలిచింది?
బైబిలు ఎన్నో వ్యతిరేకతలను తట్టుకుని ఇప్పటిదాకా నిలిచింది. మీరు దాన్ని చదువుతున్నప్పుడు, అందులోని సందేశం ఏమాత్రం మారలేదనే నమ్మకంతో ఉండవచ్చు. బైబిలు సందేశం పాడైపోయే పదార్థాల మీద రాయబడినా, దాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు జరిగినా, బైబిలు సందేశాన్ని మార్చాలని చూసినా అది ఇప్పటివరకు ఎలా నిలిచింది? ఈ గ్రంథం ప్రత్యేకత ఏంటి?
“నాదగ్గర ఉన్న బైబిలు దేవుడిచ్చిన బహుమతి అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను”
ఈ ప్రశ్నలకు చాలామంది బైబిలు విద్యార్థులు అపొస్తలుడైన పౌలు లాంటి అభిప్రాయాన్నే కలిగివున్నారు. పౌలు ఇలా రాశాడు: “లేఖనాలన్నిటినీ దేవుడు ప్రేరేపించాడు.” (2 తిమోతి 3:16) బైబిలు దేవుని వాక్యం, పైగా దేవుడే దాన్ని భద్రంగా కాపాడాడు కాబట్టి అది ఈరోజు వరకు నిలిచివుందని వాళ్లు నమ్ముతున్నారు. ముందు ఆర్టికల్‌లో ప్రస్తావించబడిన ఫైజల్ బైబిలు నమ్మదగినదో లేదో తానే స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలనుకున్నాడు. నేడు చర్చీల్లో బోధించే చాలా విషయాలు బైబిల్లో లేవని తెలుసుకుని అతను ఆశ్చర్యపోయాడు. అయితే, భూమి పట్ల దేవునికున్న సంకల్పం గురించి బైబిల్లో చదివినప్పుడు అతను చాలా సంతోషించాడు.
ఫైజల్ ఇలా చెప్పాడు: “నాదగ్గర ఉన్న బైబిలు దేవుడిచ్చిన బహుమతి అని నేను ఇప్పుడు నమ్ముతున్నాను. విశ్వాన్ని సృష్టించిన దేవుడు, మనకు తన వాక్యాన్ని ఇచ్చి దాన్ని కాపాడలేడా? ఒకవేళ ఆయన అలా చేయలేడని మనం అనుకుంటే, ఆయన శక్తిపై మనకు నమ్మకం లేనట్టే. దేవుని శక్తిని సందేహించడానికి నేను ఎంతటి వాడిని?”—యెషయా 40:8.