కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మంచిరోజులు రాబోతున్నాయి!

మంచిరోజులు రాబోతున్నాయి!

మంచిరోజులు రాబోతున్నాయి!

“కొంతకాలం తర్వాత దుష్టులు ఇక ఉండరు; ... అయితే సాత్వికులు భూమిని స్వాధీనం చేసుకుంటారు, వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:10, 11.

బైబిల్లోని ఈ మాటలు నిజమవ్వడం చూడాలనుకుంటున్నారా? చూడాలనే అందరూ కోరుకుంటారు. ఈ మాటలు త్వరలో నెరవేరతాయనే పూర్తి నమ్మకంతో మనం ఉండవచ్చు.

జరగబోయే వాటిగురించి బైబిలు ముందే చెప్పిన విషయాల్లో కేవలం కొన్ని మాత్రమే ఈ ఆర్టికల్స్‌లో చర్చించాం. మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని ఆ విషయాలు స్పష్టంగా రుజువుచేస్తున్నాయి. (2 తిమోతి 3:1-5) మనం నిరీక్షణ కలిగివుండాలనే ఉద్దేశంతోనే దేవుడు మనుషులను ఉపయోగించి ఆ విషయాలను బైబిల్లో రాయించాడు. (రోమీయులు 15:4) బైబిలు ముందే చెప్పిన విషయాలు నెరవేరుతున్నాయంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న కష్టాలు త్వరలోనే పోతాయని అర్థం.

చివరి రోజుల తర్వాత ఏం జరుగుతుంది? దేవుని రాజ్యం మనుషులందరినీ పరిపాలిస్తుంది. (మత్తయి 6:9) అప్పుడు భూమ్మీద పరిస్థితులు ఎలా ఉంటాయని బైబిలు చెప్తుందో గమనించండి:

ఆహారకొరతలు ఉండవు. “భూమ్మీద సస్యసమృద్ధి ఉంటుంది; పర్వత శిఖరాల మీద ధాన్యం పొంగిపొర్లుతుంది.”​—కీర్తన 72:16.

వ్యాధులు ఉండవు. “అందులో నివసించే వాళ్లెవ్వరూ, ‘నాకు ఒంట్లో బాలేదు’ అని అనరు.”​—యెషయా 33:24.

భూమి మళ్లీ శుభ్రంగా మారుతుంది. “ఎడారి, ఎండిన భూమి ఉల్లసిస్తాయి,

ఎడారి మైదానం సంతోషించి కుంకుమ పువ్వులా వికసిస్తుంది.”​—యెషయా 35:1.

జరగబోయే వాటి గురించి బైబిలు చెప్పే ప్రోత్సాహకరమైన విషయాల్లో ఇవి కొన్ని మాత్రమే. భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని మేం ఎందుకంత ఖచ్చితంగా నమ్ముతున్నామో తెలుసుకోవడానికి మీరు ఇష్టపడితే, యెహోవాసాక్షులు ఆ కారణాలను వివరిస్తారు.