కీర్తనలు 11:1-7

  • యెహోవాను ఆశ్రయించడం

    • “యెహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు” (4)

    • హింసను ప్రేమించేవాళ్లంటే దేవునికి అసహ్యం (5)

సంగీత నిర్దేశకునికి సూచన. దావీదు కీర్తన. 11  నేను యెహోవాను ఆశ్రయించాను.+ అలాంటప్పుడు మీరు నాతో ఈ మాట ఎలా అనగలరు: “పక్షిలా నీ పర్వతానికి ఎగిరిపో!   దుష్టులు ఎలా విల్లు ఎక్కుపెడుతున్నారో చూడు;వాళ్లు చీకట్లో నుండినిజాయితీగల హృదయం ఉన్నవాళ్ల మీద బాణాలు వేస్తారు.   న్యాయ పునాదులు పడిపోయినప్పుడు,నీతిమంతులు ఏమి చేయగలరు?”   యెహోవా తన పవిత్ర ఆలయంలో ఉన్నాడు.+ యెహోవా సింహాసనం పరలోకంలో ఉంది.+ ఆయన కళ్లు మనుషుల్ని చూస్తున్నాయి, జాగ్రత్తగా గమనించే* ఆయన కళ్లు వాళ్లను పరిశీలిస్తున్నాయి.+   యెహోవా నీతిమంతుణ్ణి, దుష్టుణ్ణి పరిశీలిస్తున్నాడు;+హింసను ప్రేమించేవాళ్లంటే ఆయనకు అసహ్యం.+   దుష్టుల మీద ఆయన ఉరుల్ని* కురిపిస్తాడు;అగ్నిగంధకాలతో,+ వడగాలితో వాళ్లను శిక్షిస్తాడు.   ఎందుకంటే యెహోవా నీతిమంతుడు;+ ఆయన నీతికార్యాల్ని ప్రేమిస్తాడు.+ నిజాయితీపరులు ఆయన ముఖాన్ని చూస్తారు.*+

అధస్సూచీలు

లేదా “ప్రకాశవంతమైన.”
లేదా “నిప్పుల్ని” అయ్యుంటుంది.
లేదా “ఆయన అనుగ్రహాన్ని పొందుతారు.”