అక్టోబరు 7-13
కీర్తనలు 92-95
పాట 84, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. మన జీవితంలో యెహోవా సేవ కన్నా గొప్పది ఇంకేది లేదు!
(10 నిమి.)
మన ఆరాధనకు యెహోవా అర్హుడు (కీర్త 92:1, 4; w18.04 26వ పేజీ, 5వ పేరా)
మంచి నిర్ణయాలు తీసుకుని సంతోషంగా ఉండడానికి ఆయన తన ప్రజలకు సహాయం చేస్తాడు (కీర్త 92:5; w18.11 20వ పేజీ, 8వ పేరా)
ముసలితనంలో కూడా తనను సేవించేవాళ్లను ఆయన మర్చిపోడు (కీర్త 92:12-15; w20.01 19వ పేజీ, 18వ పేరా)
ఇలా ప్రశ్నించుకోండి, ‘యెహోవాకు సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకోకుండా నన్ను ఏది ఆపుతుంది?’
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 92:5—ఈ మాటలు యెహోవాకున్న తెలివి గురించి సరిగ్గానే వివరిస్తున్నాయని ఎందుకు చెప్పవచ్చు? (cl 176వ పేజీ, 18వ పేరా)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 94:1-23 (th 5వ అధ్యాయం)
4. మొదటిసారి మాట్లాడేటప్పుడు
(4 నిమి.) అనియత సాక్ష్యం. మీరు బైబిలు గురించి నేర్పిస్తారనే విషయాన్ని, ఎదుటి వ్యక్తికి మాటల మధ్యలో చెప్పడానికి ప్రయత్నించండి. (lmd 5వ పాఠంలో 3వ పాయింట్)
5. మళ్లీ కలిసినప్పుడు
(3 నిమి.) అనియత సాక్ష్యం. గతంలో బైబిలు స్టడీ వద్దని చెప్పిన ఆసక్తిపరునికి మళ్లీ దాని గురించి చెప్పండి. (lmd 8వ పాఠంలో 4వ పాయింట్)
6. శిష్యుల్ని చేసేటప్పుడు
(5 నిమి.) ప్రగతి సాధించని బైబిలు విద్యార్థితో మాట్లాడండి. (lmd 12వ పాఠంలో 5వ పాయింట్)
పాట 5
7. యౌవనులారా, మిమ్మల్ని ఆందోళనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా?
(15 నిమి.) చర్చ.
యెహోవాను ఆరాధించేవాళ్లు కూడా ఆందోళనను తప్పించుకోలేరు. ఉదాహరణకు, దావీదు తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఆందోళనకు గురయ్యాడు. నేడు చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ పరిస్థితి కూడా అంతే. (కీర్త 13:2; 139:23) బాధాకరమైన విషయమేంటంటే, యౌవనులు కూడా ఆందోళనకు గురౌతున్నారు. కొన్నిసార్లు ఆందోళన వల్ల రోజూ చేసే పనులు అంటే స్కూల్‌కి వెళ్లడం, మీటింగ్స్‌కు వెళ్లడం కూడా చాలా కష్టమైపోతుంది. అలాంటి ఆందోళన వల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, దడగా అనిపించడం లాంటివే కాకుండా సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వస్తాయి.
యౌవనులారా, ఆందోళన మిమ్మల్ని ఎప్పుడైనా ఉక్కిరిబిక్కిరి చేస్తే, మీ అమ్మానాన్నల సహాయాన్ని గానీ, పరిణతిగల వాళ్ల సహాయాన్ని గానీ తీసుకోండి. యెహోవా వైపు కూడా చూడండి. (ఫిలి 4:6) ఆయన మీకు అండగా ఉంటాడు. (కీర్త 94:17-19; యెష 41:10) దానిగురించి స్టింగ్ డాట్ అనుభవాన్ని చూడండి.
యెహోవా నామీద శ్రద్ధ చూపించాడు అనే వీడియో చూపించండి. తర్వాత ఈ ప్రశ్నలు అడగండి:
• స్టింగ్ అనే సహోదరునికి ఏ బైబిలు వచనం సహాయం చేసింది, ఎందుకు?
• యెహోవా అతని మీద ఎలా శ్రద్ధ చూపించాడు?
తల్లిదండ్రులారా, మీ పిల్లలు ఆందోళన నుండి బయటపడడానికి వాళ్లు చెప్పేది ఓపిగ్గా వినండి, మీరు వాళ్లను ప్రేమిస్తున్నారని చెప్పండి అలాగే యెహోవా వాళ్లను ప్రేమిస్తున్నాడని నమ్మేలా సహాయం చేయండి. (తీతు 2:4; యాకో 1:19) ఇలాంటి సమయంలో మీకు కావాల్సిన ధైర్యం, బలం కోసం యెహోవా మీద ఆధారపడండి.
సంఘంలో ఎవరు తీవ్రమైన ఆందోళనతో బాధపడుతున్నారో, వాళ్లకు ఎలా అనిపిస్తుందో మనకు పూర్తిగా తెలియకపోవచ్చు. అయితే సంఘంలో ప్రతీ ఒక్కర్ని ప్రేమిస్తూ, పట్టించుకోవడం ద్వారా మనవంతు మనం సహాయం చేసినవాళ్లమౌతాం. —సామె 12:25; హెబ్రీ 10:24.
8. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 16వ అధ్యాయంలో 6-9 పేరాలు, 132వ పేజీ బాక్సు