కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 118

‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

‘బలమైన విశ్వాసం కలిగివుండేలా సాయం చేయి’

(లూకా 17:5)

  1. 1. అపరిపూర్ణులం మేము యెహోవా,

    మా హృదయాలోచన చెడ్డది.

    విశ్వాసలేమి ఓ ఉరితాడులా

    సులువుగా చిక్కించుకుంటుంది.

    (పల్లవి)

    బలపర్చు దేవా మా విశ్వాసాన్ని,

    నిన్నే మేము వేడుకుంటున్నాము.

    మాటల్లోను, మా చేతల్లోను నిన్నే

    మహిమపర్చేలా సాయం చేయి.

  2. 2. విశ్వాసం లేకుండా ఎవ్వరూ నిన్ను

    సంతోషపెట్టలేరు పూర్తిగా.

    బలమైన డాలులాంటి విశ్వాసం

    కాపాడుతుంది, ఇస్తుంది ధైర్యం.

    (పల్లవి)

    బలపర్చు దేవా మా విశ్వాసాన్ని,

    నిన్నే మేము వేడుకుంటున్నాము.

    మాటల్లోను, మా చేతల్లోను నిన్నే

    మహిమపర్చేలా సాయం చేయి.

(ఆది. 8:21; హెబ్రీ. 11:6; 12:1 కూడా చూడండి.)