పాట 157
శాంతి ఉంటుందిక నిత్యం!
1. హోరెత్తే సంద్రంలో
మౌన ద్వీపంలా,
ఉన్నాము ప్రశాంతముగా.
కష్టాల్ని దాటి,
చూస్తాం విశ్వాసంతో
సంద్రం శాంతించే
త్వరలో.
(పల్లవి)
భూమి తీరాలకు
శాంతి చేరును,
ఉంటుందిక నిత్యం.
కొండాకోనల్లోనూ
మైదానాల్లోనూ,
చూస్తాముగా ఇంక
శాంతిని.
2. ఆ కొత్త లోకంలో,
ఐక్యమయ్యే
యెహోవా ఆరాధకులు.
మంచల్లే కప్పు
ముందులేని శాంతి—
విలసిల్లు నీతి న్యాయం.
(పల్లవి)
భూమి తీరాలకు
శాంతి చేరును,
ఉంటుందిక నిత్యం.
కొండాకోనల్లోనూ
మైదానాల్లోనూ,
చూస్తాముగా ఇంక
శాంతిని.
(పల్లవి)
భూమి తీరాలకు
శాంతి చేరును,
ఉంటుందిక నిత్యం.
కొండాకోనల్లోనూ
మైదానాల్లోనూ,
చూస్తామింక శాంతి.
(పల్లవి)
భూమి తీరాలకు
శాంతి చేరును,
ఉంటుందిక నిత్యం.
కొండాకోనల్లోనూ
మైదానాల్లోనూ,
చూస్తాముగా ఇంక
శాంతిని,
శాంతిని!
(కీర్త. 72:1-7; యెష. 2:4; రోమా. 16:20 కూడా చూడండి)