పాట 75
‘నేనున్నాను! నన్ను పంపించు!’
-
1. నేడు యెహోవా పేరును
ప్రజలెంతో నిందిస్తారు.
క్రూరుడసమర్థుడని,
దేవుడే లేడనంటారు.
తొలగించి ఆ నిందలు,
స్తుతి పాడేవారెవరు?
(పల్లవి 1)
‘పంపించు యెహోవా నన్ను,
నే నీకు స్తుతి పాడతా.
ఇంకే ఘనతా లేదు దేవా;
నేనున్నాను, పంపించు.’
-
2. ‘ఆలస్యం చేస్తాడాయన’
అని అంటారు కొందరు.
రాతిబొమ్మల్ని పూజిస్తూ,
కైసరే దేవుడంటారు.
దేవుని తీర్పు తెలిపి
హెచ్చరించేవారెవరు?
(పల్లవి 2)
‘పంపించు యెహోవా నన్ను,
నే ధైర్యంగా హెచ్చరిస్తా.
ఇంకే ఘనతా లేదు దేవా;
నేనున్నాను, పంపించు.’
-
3. ఈ లోక స్థితిని చూసి,
ఎందరో దుఃఖిస్తున్నారు.
ఈ చీకట్లో ఆ దీనులు
వెలుగు వెతుకుతారు.
సత్యాన్ని నేర్పి వాళ్లకు
ఓదార్పునిచ్చేదెవరు?
(పల్లవి 3)
‘పంపించు యెహోవా నన్ను,
ఓర్పుతో నేను బోధిస్తా.
ఇంకే ఘనతా లేదు దేవా;
నేనున్నాను, పంపించు.’
(కీర్త. 10:4; యెహె. 9:4 కూడా చూడండి.)